ఈరోజు రైతులకు రెండో విడత రుణమాఫీ.
ఈరోజు రైతులకు రెండో విడత రుణమాఫీ.
రాష్ట్రంలోని రైతులకు ఈరోజు రెండో విడత రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇటీవల రూ.1 లక్ష లోపు రుణం ఉన్న వారికి మాఫీ అయ్యాయి. రెండో విడతలో లక్షన్నర రుణమాఫీ కానుంది.
దీంతో ఆరు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రెండో విడత కోసం ప్రభుత్వానికి రూ.7 వేల కోట్లు అవసరమని అధికారులు తెలిపారు. రెండో విడత రుణమాఫీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, మూడో విడత రుణమాఫీ ఆగస్ట్ 14వ తేదీ తర్వాత జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్ట్ 2 నుంచి 14వ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చాక రూ.2 లక్షల రుణమాఫీ ఉండనుంది.
మొదటి విడతలో భాగంగా రూ.1 లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందుకోసం రూ.6,093 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. మూడు దశల్లో చేయనున్న రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.
Post a Comment