జూలూరుపాడులో ఘనంగా ఏఐటీయూసీ105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
జూలూరుపాడులో ఘనంగా ఏఐటీయూసీ105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
కార్మికుల హక్కుల ను కాలరాస్తున్న పాలకులు ఏఐటియుసి105వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పాపకొల్లు అడ్డ వద్ద, ఏఐటీయూసీ జెండాను ఆటో వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి నిమ్మటూరి లచ్చయ్య, ఎగరవేశారు, అనంతరం సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ, కార్మికుల హక్కుల కోసం తమదైన శైలిలో అనేక పోరాటాలతో హక్కులు సాధించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు హక్కులను కాలరాసే ప్రయత్నం కొనసాగిస్తున్నారని ప్రభుత్వ సంస్థల ను ప్రవేట్ పరం చేసి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్ష కార్యదర్శులు, గార్లపాటి శివకృష్ణ, skచాంద్ పాషా,ఏఐటీయూసీ సీనియర్ నాయకులు గార్లపాటి వీరభద్రం, ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పత్తిపాటి మహేష్, అడ్డా ప్రెసిడెంట్ మహేష్, కనకపుడి నరసింహారావు, వెంకటేశ్వర్లు, శివ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment