నేషనల్ లెవెల్ ఓపెన్ యోగ ఛాంపియన్ షిప్ లో జాతీయ స్థాయిలో 1st prize సాధించిన సాయి ఎక్స్ లెంట్ విద్యార్ధి సోడెం నరేందర్ నాథ్ భగవత్
నేషనల్ లెవెల్ ఓపెన్ యోగ ఛాంపియన్ షిప్ లో జాతీయ స్థాయిలో 1st prize సాధించిన సాయి ఎక్స్ లెంట్ విద్యార్ధి సోడెం నరేందర్ నాథ్ భగవత్
జూరురుపాడ్ మండల కేంద్రం లోని పాపుకొల్లు రోడ్ సాయి ఎక్స్ లెంట్ విద్యార్ధి అయినా సోడెం నరేందర్ నాథ్ భగవత్ 4వ తరగతి చదువుతున్న విద్యార్ధి ఆగష్టు 23, 24, 25 తేదీలలో జరిగిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో ప్రథమ బహుమతి సాధించడం జరిగింది. బహుమతి ప్రధానోత్సవం అక్టోబర్ 21 న కొత్తగూడెం లోని శారదా విద్యాకుటీర్ నందు ఆర్గనైజర్ గుమలాపురం సత్య నారాయణ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా సాయి ఎక్స్ లెంట్ అకాడమిక్ డైరెక్టర్ అయినా గోలి వీరభద్రం మరియు సుజాత మరియు ఉపాధ్యాయుల బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోలి వీర భద్రం మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆరోగ్య పరంగా మరియు శరీర ధృడత్వం ఉండాలి అంటే యోగ ఎంతో అవసరమని ప్రస్తుత రోజుల్లో విద్యార్థుల యొక్క జీవితం యంత్రికంగా కొనసాగుతుందని, పూర్వకాలంలో లాగా ఆటలు లేవని దానివల్ల చిన్నతనంలోనే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
ఈ ఆరోగ్య సమస్యలను అధికమించాలంటే తప్పనిసరిగా విద్యార్థులు యోగా చేస్తూ ప్రతియొక్క విద్యార్ధి తన ఆరోగ్యాన్ని పెంపొందించు కోవాలన్నారు అదే విధంగా నరేందర్ కు మరియు తల్లిదండ్రులైన శ్రీరామ్, అరుణ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అకాడమిక్ డైరెక్టర్ సుజాత మాట్లాడుతూ సాయి ఎక్స్ లెంట్ స్కూల్ నందు యోగా క్లాసులు నిర్వహించడంతో పాటు ప్రతి విద్యార్ధి చదువుతో పాటు వారి ఆరోగ్యం పై దృష్టి పెట్టి చదువులో నవోదయ, గురుకులాలకు కోచింగ్ ఇస్తూ పేద విద్యార్థులకు నిత్య అండదండలు ఉంటున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందమైన శివ కుమారి, అనిత, నబీన, జమున, సాహితి, దుర్గా భవాని, భాను నవ్య, హరిత తదితరులు పాల్గొన్నారు.
Post a Comment