ఇదొ రకం ఇసుక దందా.టన్ను పై 5 నుండి6 వందల వరకు అధిక ధరలపై చర్యలు శూన్యం

 
ఇదొ రకం ఇసుక దందా.టన్ను పై 5 నుండి6 వందల వరకు అధిక ధరలపై చర్యలు శూన్యం

ఇదొ రకం ఇసుక దందా.టన్ను పై 5 నుండి6 వందల వరకు అధిక ధరలపై చర్యలు శూన్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 30( టీవీ 17 న్యూస్) 

జూలూరుపాడు మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా, కొందరు ఇసుక వ్యాపారస్తులు వే బ్రిడ్జిలను అడ్డాలుగా చేసుకొని ఇసుకను కుప్పలుగా పోసి రిటైల్ గా అమ్మ కాలు ప్రారంభించారు.  టన్ను ,రెండు టన్నుల ఇసుక అవసరాలు ఉన్నవారు ఇసుక అందుబాటులో ఉంది అనుకొని సంతోష పడ్డారు ఇదే అదునుగా భావించిన కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇసుకపై టన్నుకు 5 నుంచి 6 వందల రూపాయలు వరకు అధిక ధరలతో వినియోగదారులనుబాదుతున్నారు. టన్ను 15 నుంచి 1600 రూపాయలకు అమ్ముతూ అదనంగా రవాణా, కాంటాలకు సైతం అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. టన్నుకు 11, నుండి 12 వందల రూపాయలు అసలు ధర ఉండగా జూలూరుపాడులో మాత్రం 1500 వరకు అమ్ముతున్నారు .ఇప్పటికైనా అధికారులు ఇసుక అమ్మకానికి అనుమతులు ఉన్నాయా, ఉంటే ఎలాంటి ధరల్లో నమ్ముతున్నారు అనే విషయాలపై ఆరా తీసి చర్యలు తీసుకోవాలని ఇసుక వినియోగదారులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.