*ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఉద్యోగి నాగరాజు*
*ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఉద్యోగి నాగరాజు*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( టీవీ 17 న్యూస్) పాల్వంచ.
ఒకపక్క లంచం తీసుకుంటూ వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు ACBచిక్కుతున్నప్పటికీ లంచగొండులకు మాత్రం ఎలాంటి భయం లేకుండా పోతోంది, తాజాగా పాల్వంచకు చెందిన ట్రాన్స్ కో లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
గూగులొత్ నాగరాజు అనే వ్యక్తి తన ఇంటి విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోగా. పరిశీలించి మీటర్ మంజూరు చేయాల్సిన అధికారులు కాలయాపన చేస్తున్నారే,తప్ప మీటర్ బిగించలేదు చివరికి లంచం ఇస్తే కానీ మీటర్ పెట్టలేమన్న పరిస్థితి ఏర్పడింది విసుగు చెందిన గూగులొత్ నాగరాజు చేసేదేమీ లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సదరు ట్రాన్స్కో నాగరాజ్ పై నిఘా పెట్టారు బుధవారం గూగులొత్ నాగరాజు వద్ద నుండి 26 వేల రూపాయల లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఎల్ఐ నాగరాజు ఏసీబీ అధికారులను చూసి పారిపోతుండగా ACB,DSPరమేష్ తన సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ సందర్భంగా ACB,DSP మాట్లాడుతూ లంచం తీసుకుంటున్న ట్రాన్స్కో లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Post a Comment