*మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంద రంజిత్ కుమార్*

 
*మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంద రంజిత్ కుమార్*


*మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంద రంజిత్ కుమార్* 


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు అక్టోబర్ 25 ( టీవీ 17 న్యూస్) తెంలంగాణ రాష్ట్ర మాల మహానాడు నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూలూరుపాడు మండల వాసిమంద రంజిత్ కుమార్ ని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జీ. చెన్నయ్య ప్రకటించారు. 

శుక్రవారం నాడు హైదరాబాద్ లోని మాల మహానాడు జాతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. 

మంద రంజిత్ కుమార్ తెలంగాణ మలిదశ ఉద్యమంతో పాటు జేఎన్టీయుహెచ్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా విద్యా రంగ సమస్యలపై, సామాజిక ఉద్యమంలో ముందుండి పోరాటం చేస్తూ, దళిత హక్కులకై పోరాటం చేస్తున్న మంద రంజిత్ కుమార్ నీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం చేశామని పత్రిక ప్రకటన ద్వారా జాతీయ అధ్యక్షులు జీ. చెన్నయ్య తెలిపారు. 

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. నా ఎన్నికకు సహకరించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జీ. చెన్నయ్య,తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు  డాక్టర్. బూరుగు వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాల మహానాడు సవాలు చేసిందని, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని తీర్పును రివ్యూ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో ఎస్సీ వర్గికరణకు వ్యతిరేకంగా మాలలను చైతన్య పరచాలనీ అలాగే మాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి భవిష్యత్తులో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు.

Blogger ఆధారితం.