ప్రత్తికొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మార్కెటింగ్ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్.బయ్యర్లకు పలు సూచనలు._
ప్రత్తికొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మార్కెటింగ్ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్.బయ్యర్లకు పలు సూచనలు._
_పత్తి దిగుబడులు తగ్గాయి._
_భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నవంబర్ 7 (టీవీ 17 న్యూస్)
జూలూరురుపాడు మండల కేంద్రంలో ప్రత్తి మార్కెట్ యార్డును గురువారం వరంగల్ రీజన్ మార్కెటింగ్ శాఖ సంయుక్తసంచాలకులు శ్రీనివాస్. డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి జిల్లా మార్కెటింగ్ అధికారి నరేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు ప్రతి కొనుగోలు చేస్తున్న బయ్యర్లతో మాట్లాడారు.
తేమ లేకుండా రైతులు మార్కెట్ కి ప్రతిని తీసుకురావాలనీ తద్వారా మంచి రేటును పొందవచ్చు అని అన్నారు ఈ సంవత్సరం కొన్ని కారణాలవల్ల పత్తి దిగుబడి తక్కువగా వచ్చిందని రైతులు కొంచెం ఇబ్బందిలో ఉన్నారని అందుకోసం బయ్యర్లు ప్రతి రైతులకు సాధ్యమైనంత విధిగా రేటు విషయంలో న్యాయం చేయాలని సూచించారు.తేమశాతం ఇప్పుడిప్పుడే తగ్గుతుందని . ఇంకా క్వాలిటీ ప్రత్తి రైతుల నుండి వస్తుందని అన్నారు.
*మార్కెట్కు కేటాయించిన స్థలాన్ని* *పరిశీలించిన సంయుక్త సంచాలకులు* *శ్రీనివాస్*
జూలూరుపాడు ప్రత్తి మార్కెట్ యార్డుకు కేటాయించిన పది ఎకరాల స్థలాన్ని శ్రీనివాస్ పరిశీలించారు. అయితే మార్కెట్ యార్డ్ కు ప్రత్తి బాగా వస్తున్నందున సదుపాయాలు లేకపోవడం లోటే అనీ అన్నారు అయితే త్వరలోనే యార్డు అభివృద్ధి కోసంప్రతిపాదనలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని మార్కెట్ అభివృద్ధిపై దృష్టి పెడతామని అన్నారు. కార్యక్రమంలో ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి బజారు ఉన్నారు._
Post a Comment