ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు మూసివేసారెoదుకో. అధికారులు వచ్చేది ముందే తెలిసిందా?
ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు మూసివేసారెoదుకో. అధికారులు వచ్చేది ముందే తెలిసిందా?
_భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నవంబర్ 22 టీవీ 17 న్యూస్
జూలూరుపాడు మండల కేంద్రంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు శనివారం మూసి ఉన్నాయి . జిల్లా అధికారులు ఎవరైనా సందర్శనకు వస్తున్న సమాచారం తెలిసిందో ఏమో కానీ సెంటర్లన్నీ మూసివేసి ఉన్నాయి. ఆర్ఎంపీలు అధిక మోతాదులో ఇంజక్షన్ డోస్ లు ఇస్తున్నారు అని చర్చ మండల వ్యాప్తంగా జరుగుతోంది.. అదేవిధంగా టెస్టులు విషయంలో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే వార్తలు వినపడుతున్నాయి. అయితే ఎవరైనా అధికారి వస్తున్నారు అని సమాచారంతోనే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు మూసి వేసి ఉంటారని అని మండల కేంద్రంలో ప్రజలు చర్చించుకుంటున్నారు._
Post a Comment