ఘనంగా సాయి ఎక్సలెంట్ పాఠశాల 27వ వార్శికోత్సవం.

 


ఘనంగా సాయి ఎక్సలెంట్ పాఠశాల 27వ వార్శికోత్సవం.

   జూలూరుపాడు మండలకేంద్రంలో ని  సాయి ఎక్సెలెంట్ పాఠశాల  27వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రోడ్డు,భవనాలు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మరియు సాయి ఎక్సెలేంట్ పాఠశాల  వ్యవస్థాపకులు గొల్లమందల రమేష్, ప్రధానోపాధ్యాయులు  శారద ,ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు. 


ఈ సందర్భంగా  రమేష్ మాట్లాడుతూ, సాయి ఎక్సలెంట్ పాఠశాల  వార్షకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో సంతోషకరమని సాయి ఎక్సలెంట్ స్కూల్ మొట్ట మొదటి సారిగా ముగ్గురు విద్యార్థులతో ప్రారంభించి ఇప్పుడు 1000 మంది విద్యార్థులు చదువు కోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు విద్యార్థులు, నవోదయ,గురుకుల పాఠశాల కొంచింగ్ విద్యార్థులు ప్రతి సంవత్సరం పోటీ పరీక్షల్లో  ఎక్కువ సీట్లు సాధించడం సంతోషకరమన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు బోధించే విద్యను శ్రద్ధతో అభ్యసించి ప్రతి విద్యార్థి కూడా    భావితరాలకు ఆదర్శప్రాయంగా ఉండాలని, అంతేకాకుండా సాయి ఎక్సలెంట్ పాఠశాల యాజమాన్యం కూడ ప్రస్తుత, భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని సాంకేతిక విద్యను అభ్యసించాలని సూచిస్తూ, ఇదే స్ఫూర్తి తో ఈ సంవత్సరం కూడా విద్యార్థులు పోటీ పరీక్షలలో మరిన్ని సీట్లు సాధించే విధంగా కోచింగు ఇవ్వాలని తెలిపారు. 

ప్రధానోపాధ్యాయులు శారద మాట్లాడుతూ    గత ఐదు సవత్సరాల నుండి నవోదయ,గురుకులం పాఠశాల ప్రవేశ పరీక్షలో  సాయి ఎక్సలెంట్ స్కూల్ లో కోచింగ్ పొందిన విద్యార్థులకు ఎక్కువ సీట్లు రావడం ఎంతో సంతోషకరమని అన్నారు. కేవలం పేద విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నవోదయ, గురుకుల పాఠశాలలో విద్యార్థుల కు సీట్ వచ్చే విధంగా కోచింగ్ ఇవ్వడంతోపాటు ఈ సంవత్సరం గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశ పరీక్షలో   విద్యార్థులు ఎక్కువ మొత్తంలో  విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్ సాధించే విధంగా,  జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో  విద్యార్ధలు ఎక్కువ మొత్తంలో సీట్లు సాధించే విధంగా కృషి చేస్తామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సెక్రెటరీ జో, విశ్వశాంతి స్కూల్ ప్రిన్సిపల్ నరసింహారావు, సాయి ఎక్స్లెంట్ పాఠశాల డైరెక్టర్ హుస్సేన్, కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ ఉపాధ్యాయులు శివకుమారి, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి ఎక్స్లెంట్ పాఠశాల ఉపాధ్యాయులు 

సరిత, అనిత, నభీన, జమున, ఉదయభాను, సాహితీ, సుజాత, దుర్గ భవాని, సత్యవతి, పావని, సరిత, నవ్య, కళ్యాణి, కుమారి, అరుణ, పద్మ, అఖిల, హరిత, రజిత, రాంబాబు, రామ్ కుమార్, భద్రం, నరసింహారావు, శాంతమ్మ, భారతమ్మ , విద్యార్థుల తల్లిదండ్రులు,  మరియు పెద్దలు వేల్పుల నరసింహారావు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.