99tv 2025 క్యాలెండర్ను ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.


99tv 2025 క్యాలెండర్ను ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం 99 టీవీ 2025 సంవత్సరం నూతన క్యాలెండర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ షేక్ ఖాసిం ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు.


 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 99టీవీ ప్రేక్షకులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సంవత్సరం ప్రజలంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు అదేవిధంగా ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


 ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురి అయితే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు అదేవిధంగా యువత గంజాయి మత్తుకు డ్రగ్స్ కు గురి అవుతున్నందున ఎవరైనా గంజాయి విక్రయించిన సేవించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

Blogger ఆధారితం.