ఏసీబీ అధికారులకు చిక్కిన రెవెన్యూ అధికారి.
ఏసీబీ అధికారులకు చిక్కిన రెవెన్యూ అధికారి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన దమ్మపేట మండల తహసిల్దార్ కార్యాలయం మరోసారి వార్తలలో నిలిచింది..
ఇప్పటికే రెవెన్యూశాఖ మంత్రి స్వయంగా కార్యాలయంలో తనిఖీలు చేసి ఇక్కడి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన విషయం తెలిసిందే..
మరో 48గంటలు గడవకముందే ఏసీబీ అధికారులు అదే కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న ఎం.వెంకటరత్నం 50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనం అయ్యింది..
దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన 19ఎకరాల రెండు కుంటల భూమికి సంభందించి స్థానిక రెవెన్యూ కార్యాలయంలో పాస్ బుక్ కోసం ధరఖస్తు చేసుకోగా,భూమి నీ సర్వే చేసిన సర్వేయర్ మెరుగు.వెంకటరత్నం సర్వే చేసి వివరాలను తన దగ్గరే పెట్టుకొని , రైతును లాక్షా యాభై వేల రూపాయలు డిమాండ్ చేయగా రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు ,.
ఏసీబీ అధికారుల పథకం ప్రకారం రైతు , సర్వేయర్ వెంకటరత్నానికి 50వేలా రూపాయలు ఇచ్చే విధముగా ఒప్పందం చేసుకొన్నాడు..
ఈ క్రమంలో శనివారం ఉదయం 12గంటల సమయంలో దమ్మపేట మండలం గంధీనగరం వద్ద రైతు నుండి సర్వేయర్ వెంకటరత్నం 50 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు..
అనంతరం సర్వేయర్ ను విచారించిన ఏసీబీ అధికారులతో లంచం తీసుకుంతున్నట్టు ఒప్పుకోవటంతో సర్వేయర్ ను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేయనున్నట్టు తెలిపారు.
Post a Comment