తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలుగా నిర్మల జ్యోతి.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలుగా నిర్మల జ్యోతి.
_నియామక పత్రాన్ని అందజేసిన ఏలూరు శ్రీనివాసరావు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం టీవీ17 న్యూస్ డిసెంబర్ 30
తెలంగాణ మహిళ సంక్షేమ శాఖ గెజిటెడ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కల్లూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని నిర్మల జ్యోతి ఎంపిక అయ్యారు హైదరాబాదులో జరిగిన సంఘం సమావేశంలో ఆదివారం నిర్వహించగా రాష్ట్రంలోని ప్రెసిడెంట్ అధికారులు పాల్గొన్నారు.
ఏలూరు శ్రీనివాసరావు కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది ఈ ఎన్నికల ఉపాధ్యక్షురాలుగా పెరుమాళ్ళ నిర్మల జ్యోతిని ఎంపిక చేస్తూ ఏలూరు శ్రీనివాసరావు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నిర్మల జ్యోతి మాట్లాడుతూ తనను ఈ పదవికి ఎంపిక చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేశారు తన వంతు బాధ్యతగా ఉద్యోగుల సమస్యల కోసం కృషి చేస్తానని అన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఎంపికైనందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి ఆమెను పలువురు అభినందించారు.
చండ్రుగొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో సిడిపిఓగా పనిచేసిన ఈమె ప్రస్తుతం కల్లూరు ఐసిడిఎస్ ప్రాజెక్టులో సిడిపిఓ గా పని చేస్తున్నారు. సమస్యల పట్ల అవగాహన ఉన్న నిర్మల జ్యోతిని ఎంపిక చేయటం సరైన నిర్ణయమని పలువురు అభినందిస్తున్నారు._
Post a Comment