చిన్నారి ప్రాణం తీసిన నీటి తొట్టి కన్నీరు మున్నూరు అవుతున్న తల్లిదండ్రులు.
చిన్నారి ప్రాణం తీసిన నీటి తొట్టి కన్నీరు మున్నూరు అవుతున్న తల్లిదండ్రులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని మాచిన పేట తండాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. లాకావత్ అశోక్ అలియాస్ పీటర్ శివాని దంపతుల రెండు సంవత్సరాల కుమారుడు మంజునాథ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తోట్టిలో పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నూరు అవుతున్నారు.
కోతుల బెడద కారణంగా తల్లి ఇంట్లో తలుపులు వేసి వచ్చుసరికి బయట ఆడుకుంటున్న కుమారుడు ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి నీటిలో తేలి ఆడుతుండగా తల్లి భయంతో చుట్టుపక్కల ఉన్న బంధువులను పిలిపించి బయటికి తీయించగా అప్పటికే వికటజీవిగా కనిపించాడు తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Post a Comment