ROFR పట్టా భూముల్లో సోలార్ యూనిట్లు.మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఏర్పాట్లు.స్థల పరిశీలన చేసిన రెవిన్యూ అధికారులు .
ROFR పట్టా భూముల్లో సోలార్ యూనిట్లు.మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఏర్పాట్లు.స్థల పరిశీలన చేసిన రెవిన్యూ అధికారులు .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం డిసెంబర్ డిసెంబర్ 17( టీవీ17న్యూస్) మండల పరిధిలోని సూరారం మూన్య తండా అటవీ ప్రాంతాల్లోని TOFR పట్టాల్లో సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు స్థల పరిశీలనకు వెళ్ళినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాదరావు తెలియజేశారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాల్లో యూనిట్ల నెలకొల్పుటం ద్వారాస్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వ సహకారంతో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అటవీ ప్రాంతాల్లో అనువైన ప్రదేశాలను పరిశీలిస్తున్నామని అన్నారు.
సుమారు కోటిన్నర రూపాయల వ్యయంతో ప్లాంట్ ఏర్పాటులకు సన్నాహాలు చేస్తున్నట్లు, అందులో ప్రభుత్వం 90% భరిస్తుందని సంఘాలు 10% భరిస్తే యూనిట్లు వాళ్లకే అప్ప చెప్తారని తద్వారా సోలార్ యూనిట్లను జూలూరుపాడులో ఉన్న మూడు విద్యుత్ సబ్స్టేషన్లకు అనుసంధానం చేస్తారని అట్టి కరెంటును 3రూపాయల 30 పైసలు లెక్క ప్రభుత్వమే కొనుగోలు చేసి సంఘాలకు చెల్లిస్తుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
ప్రజల అవసరాల కోసం ఈ విద్యుత్తును వినియోగిస్తారని. చెప్పారుఈ కార్యక్రమానికి స్వయంసేవక సంఘాలు రైతులు ,రెవెన్యూ, అగ్రికల్చర్ ,సెక్రటరీలు విద్యుత్ అధికారులు పాల్గానాన్నారని యూనిట్లు నెలకొల్పేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించి పంపామని అన్నారు.
Post a Comment