సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి. 3 km 2 కోట్లు వ్యయం.
సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి. 3 km 2 కోట్లు వ్యయం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని వేపలగడ్డ సమీపంలో రైల్వే లైన్ పై నిర్మించిన ఫ్లైఓవర్ పై రోడ్లు భవనాల నిధులతో సుమారు మూడు కిలోమీటర్ల దూరం రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ఎంపీ రఘురాం రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూనంనేనీ సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు.
ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి కలెక్టర్ జితేష్ వీపాటిల్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఇందిరామరాజ్యము కావాలని ఆకాంక్షతో తెచ్చుకున్నారని అలాంటి ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు నిరంతరం కృషి చేస్తుందని అన్నారు ఇచ్చిన 6 గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు పరచాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే దిశగా వెళుతోందని అన్నారు. కొత్తగూడెం అభివృద్ధి జరగాల్సి ఉందని గిరిజన గ్రామాలతో ఉన్న జిల్లా సింగరేణి సిరులు ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడిపోయిందని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గారితో కలిసి అభివృద్ధి పరచేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు నాగా సీతారాములు. విజయ భాయ్. రాజశేఖర్, శ్రీనివాస్ లేళ్ల వెంకటరెడ్డి దుద్దుకూరు మధుసూదన్ రావు. తదితరులు పాల్గొన్నారు.
Post a Comment