ఎమ్మెల్యేను సన్మానించిన కొత్తగూడెం జర్నలిస్టులు. జర్నలిస్టుల సమస్యలు తీర్చాలని విజ్ఞప్తులు.
ఎమ్మెల్యేను సన్మానించిన కొత్తగూడెం జర్నలిస్టులు. జర్నలిస్టుల సమస్యలు తీర్చాలని విజ్ఞప్తులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం. కొత్తగూడెం జర్నలిస్టులు నూతన సంవత్సరం సందర్భంగా కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శనివారం కూననేని సాంబశివరావును కలసి ఘనంగా సన్మానించి మెమొంటోను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావాలని, అందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు జర్నలిస్టుల కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జర్నలిస్టులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కొత్తగూడెం అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు కొత్తగూడెం అభివృద్ధి పరచటంలో నిత్యం పనిచేస్తున్నానని కొత్తగూడాన్ని కార్పొరేషన్ చేసే దిశలో ముందడుగు వేస్తున్నామని, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు, ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి కూడా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.
Post a Comment