చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయింది.

 


చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయింది.



*గుజరాత్ లో రెండు నెలల చిన్నారికి HMPV వైరస్*


 *గుజరాత్ రాష్ట్రంలో HMPV వైరస్ తొలి కేసు నమోదు*


హైదరాబాద్: జనవరి 05 

భారతదేశంలో HMPV వైరస్‌ విజృంభిస్తుంది. ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరల్ సోకగా.. 



తాజాగా, గుజరాత్‌ రాష్ట్రంలో రెండు నెలల చిన్నారికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం పాపను అహ్మదా బాద్‌లోని ఓ ప్రైవేట్ హస్పటల్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 


కాగా, ఇప్పటి వరకు దేశంలో మూడు హెచ్ఎం పీవీ కేసులు వెలుగు చూశాయి. శ్వాసకోశ వ్యాధుల విషయంలో ICMR సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ కేసులు వెలుగులోకి వచ్చా యని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.


అయితే, ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే వ్యాప్తి చెందుతుంది. ఇది శీతాకాలంలో జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలను కలిగి ఉంది. ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. 



కాగా, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జలుబు, ఫ్లూ లక్షణాలుఉన్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. తుమ్ములు, దగ్గు వచ్చినపుడు కర్చీఫ్ లాంటివి అడ్డుపెట్టుకోవాలి.. అలాగే, చేతులను తరచూ క్లీన్ చేసుకోవాలని చెప్తున్నారు. 


దీంతో పాటు కరచాలనం చేయడం, జబ్బు ఉన్న వారి దగ్గరకు వెళ్లడం, కళ్లు, ముక్కును తరచూ తాక డం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం చేయొద్దని వైద్యులు వెల్లడించారు.

*ఇండియాలోకి ఎంటర్ అయిన  హెచ్ఎంపీవీ వైరస్*


*చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయింది. బెంగళూరులో ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకింది. నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది.ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి వచ్చిన నివేదిక ప్రకారం శిశువు పాజిటివ్ పరీక్షించిందని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఇంకా తమ ల్యాబ్ లో ఎలాంటి పరీక్షలు చేయలేదన్నారు. ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను తాము అనుమానించాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఫ్లూ నమూనాలలో దాదాపు 0.7% HMPVగా గుర్తించబడ్డాయి. ఇండియాలో ఇదే తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు కావడం గమనార్హం. HMPV లేదా హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ సాధారణంగా 11 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో వస్తుంది.*


Blogger ఆధారితం.