మండల కేంద్రంలో ఎస్ఐ రవిఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాల్లో భాగంగా విద్యార్థులతో ర్యాలీ.

 



మండల కేంద్రంలో ఎస్ఐ రవిఆధ్వర్యంలో  జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాల్లో భాగంగా విద్యార్థులతో ర్యాలీ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..జూలూరుపాడు  మండల కేంద్రంలో ఎస్ఐ రవిఆధ్వర్యంలో సోమవారం జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాల్లో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వేగం వద్దు నియంత్రణే ముద్దు అంటూ నినాదాలు చేశారు ర్యాలీ అనంతరం మండల కేంద్రంలో మానవహారం నిర్వహించి ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలను నివారించడంలో కృషి చేయాలన్నారు ఎస్సై మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా వాహనాలకు వ్యక్తులకు ఇన్సూరెన్స్ ఉండాలని యూటర్న్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఇండికేటర్లను ఉపయోగించాలని హెల్మెట్లు ధరించాలని వాహనాలను వేగంగా నడపరాదని మద్యం సేవించి వాహనాలు నడపడంతో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బందితోపాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.